JAI TELANGANA

JAI TELANGANA
TELANGANA Na JANMA HAKKU

Wednesday, October 27, 2010

నవంబర్ ద్రోహాన్ని తరిమేద్దాం డిశంబర్ ద్రోహాన్ని పాతరేద్దాం

నవంబర్ 1 ఆంద్ర ప్రదేశ్ కు పుట్టిన రోజు కావచ్చు.పండగ రోజు కూడా కావచ్చు.కాని తెలంగాణా ప్రజలకు అది పుట్టిన రోజు కాదు,పండగ రోజు అంతకంటే కాదు.నవంబర్ ఒకటి తెలంగాణా ప్రజలు తమ అస్తిత్వాన్ని,ఆత్మగౌరవాన్ని,ఆస్తులను పోగొట్టుకున్న రోజు.ఆంధ్ర ప్రదేశ్ పేరు మీద తెలంగాణకు సమాధి కట్టడానికి పునాదులు వేసిన రోజు.నవంబర్ 1 సీమాంధ్ర పాలకులకు మాత్రమె పండగ రోజు.అపారమైన తెలంగాణా వనరులను హస్త గతం చేసుకున్నందుకు వారికది పండగ రోజు.తెలంగాణపై అధికారం చేజిక్కించుకున్నందుకు వారికది విజయ దినోత్సవం.కానీ నవంబర్ 1 తెలంగాణా ప్రజలకు ఒక దుర్దినం.తెలంగాణా తన పుట్టిన రోజును,పండగ రోజును తెలంగాణా రాష్ట్రము ఏర్పడినప్పుడే చేసుకో గలుగుతుంది .అందుకే మనం అన్నీ పోగొట్టుకోవడానికి కారణం అయిన నవంబర్ 1 ని తెలంగాణా ప్రజలందరం నిరసన దినంగా పాటిద్దాం.శాశ్వత సమాధిగా మారబోతున్న ఆంధ్ర ప్రదేశ్ లో మేము చావదలుచుకో లేదని ప్రకటిద్దాం.తెలంగాణా రాష్ట్ర సాధన వరకు విశ్రమించకుండా పోరాడుదాము.
తెలంగాణా ప్రజలు వ్యతిరేకించినా,కేంద్ర ప్రభుత్వమే నియమించిన రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణ కమిషన్ (ఫజల్ అలీ కమిషన్ ) ఇప్పుడే వద్దని చెప్పినా,సీమాంధ్ర నాయకులు కుట్రలు కుహాకాలు చేసి తెలంగాణాను బలవంతంగా ఆంధ్ర ప్రదేశ్లో విలీనం చేశారు.పెద్దమనుషుల ఒప్పందం పేరుమీద తెలంగాణా ప్రజలను వంచించారు.తెల్లారి నుండే ఒప్పందాలను ఉల్లంఘించారు.అన్నిరకాలుగా అభివృద్ధి చెందడానికి అవకాశాలు,వనరులు వున్నా ఈ 54 సంవత్సరాలలో తెలంగాణను ఆకలి చావుల,ఆత్మహత్యల,నిరుద్యోగుల,వలసజీవుల ప్రాంతంగా మార్చివేశారు.నీటి వనరులను దోచుకెళ్ళారు.పరిశ్రమలను ధ్వంసం చేశారు.సీమాంధ్ర కంటే ఆదాయం వనరులు ఎక్కువగా వున్నా తెలంగాణాను చివరికి వెనక బడ్డ ప్రాంతంగా దిగజార్చి వేశారు.ఇదంతా 1956 నవంబర్ 1 న జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు వలెనే జరిగింది.
ఈ కథంతా ఈ మోసం అంతా తెలంగాణా ప్రజలకు తెలియనిది కాదు.తెలుసుకున్నందుకే తెలంగాణా ప్రజలు మేము ఆంధ్ర ప్రదేశ్ లో వుండమంటూ దశాబ్దాలుగా ఆందోళనలు చేస్తూ వస్తున్నారు.వందల మంది తెలంగాణా బిడ్డలు స్వంత రాష్ట్రము కొరకు తమ ప్రాణాలను త్యాగం చేశారు.ఎన్నోసార్లు పొలిమేరల వరకు వచ్చిన తెలంగాణాను చూస్తూ ఉండగానే సీమాంధ్ర మాంత్రికులు మాయం చేశారు.అంటే 1956 నవంబర్ 1 న మాత్రమె ద్రోహం జరగా లేదు.ఆ రోజు నుండి ద్రోహం కోన సాగుతూనే వున్నది. అంటే కాదు ఈ సీరియల్ ద్రోహాలలో కేవలం సీమాంధ్ర నాయకులు మాత్రమె లేరు,వారితో తెలంగాణకు చెందిన వారి తొత్తు నాయకులు కూడా వున్నారు.వీరి ద్రోహాల,వెన్నుపోట్ల కారణంగానే ప్రజలు ఎన్ని ఉద్యమాలు చేసినా తెలంగాణా రాష్ట్రాన్ని సాధించుకో లేకపోతున్నాము.
ఇక ఇప్పుడు కేవలం నవంబర్ 1 ద్రోహానికి నిరసన తెలియ చేయడం మాత్రమె సరిపోదు.డిశంబర్ ద్రోహులకు,ద్రోహాలకు వ్యతిరేకంగా కూడా పోరాడినప్పుడే తెలంగాణాను సాధించుకోగలుగుతాము.తెలుగు దేశం పార్టి,కాంగ్రెస్ పార్టి లు తెలంగాణకు అనుకూలమే అంటూ 2009 డిశంబర్ 9 వరకు కోతలు కోశాయి.కాని డిశంబర్ 9 తరువాత నుండి ఈ రెండు పార్టీలే తెలంగాణా వ్యతిరేక బూటకపు ఉద్యమాన్ని సృష్టించి డిశంబర్ ద్రోహానికి పాల్పడినాయి.తెలంగాణా రాష్ట్ర ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లుగా పార్లమెంటులో ప్రకటన చేసినప్పుడు వ్యతిరేకించిన తెలుగు దేశం పార్టీయే ఇప్పుడు పార్లమెంటులో బిల్లు పెట్టాలంటూ దొంగ నాటకాలు ఆడుతున్నది.కాంగ్రెస్ పార్టి మొసలి కన్నీరు కారుస్తూ డబ్బులు పంచుతూ తిరుగుతున్నది.ఈ డిశంబర్ ద్రోహుల,ద్రోహాల ను మరిచి పొతే,ఎండగాట్టక పొతే,ఎదుర్కోక పొతే తెలంగాణా అందని ద్రాక్షే అవుతుంది.ఈ నిరసన దినాన శపథం చేద్దాం. నవంబర్ ద్రోహులను తరిమేద్దాం , డిశంబర్ ద్రోహులను పాతరేద్దాం .
ప్రతి ఇంటిపైన నల్ల జెండా ఎగుర వేద్దాం. గల్లి గల్లికి లొల్లి చేద్దాం.... జై తెలంగాణా

No comments:

Post a Comment