సీమాంధ్ర పెట్టుబడిదారుల టీవీ ఛానల్, వార్త పత్రికలూ అన్ని చంద్ర శేఖర్ రావు గారు ప్రత్యెక ఆంధ్ర ఉద్యమం మొదలు పెట్టడం వల్లే అమాయకపు విద్యార్థులు ప్రజలు ఆత్మ హత్యలకు పాలు పడుతున్నారు అని లోకం చెవులు పగిలేట్టుగా అరుస్తున్నై వ్రాస్తున్నై. 09 - 12 - 2009 తరువాత జరిగిన అన్ని ఆత్మహత్యలకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అడ్డు పడ్డ సీమాంధ్ర నేతలు అప్పడప్పుడు వాళ్ళ మసి పూసి మారేడుకాయ చేసే మాటలు తెలంగాణా ప్రజలు ఆత్మహత్యలు చేసుకుందుకు కారణాలు. వాళ్లకు సిగ్గు శరం లేనందుకే తెలంగాణా ప్రజలు ఉప ఎన్నికలలో చెంప పెట్టుగా ఇచ్చిన నిర్ణయాన్ని సానుభూతి వోటు గ వ్యక్తీకరిస్తున్నారు. ఇప్పుడు ఇక మన టీవీ ఛానల్ ఉంది మన వార్తా పత్రిక త్వరలో రాబోతుంది. సీమాంధ్ర నాయకుల పుట్టుకలే అవినీతి పుట్టుకలు. నిజం తెలుసుకుందుకు మనం మన టీవీ ఛానల్ ను మాత్రమె చూద్దాం. మన వార్తా పత్రిక నే చదువుదాం. శ్రద్ధ ఓర్పు రెండు బహు మంచి లక్షణాలను ఆచరించమని సాయి బాబా ప్రవచించి ఉన్నాడు. శ్రద్ధగా తెలంగాణా సాధించుకునేందుకు ఓర్పుగా ప్రయత్నిద్దాం.
ఆత్మ హత్యలను నివారిద్దాం.
జై తెలంగాణా, జై జై తెలంగాణా
No comments:
Post a Comment